Gold Imports: బంగారాన్ని తెగ ముద్దు చేసే మన దేశం ఇప్పుడు ‘వద్దు’ అంటోంది. ఫలితంగా పుత్తడి దిగుమతులు మూడో వంతుకు పైగా పడిపోయాయి. డిసెంబరులో ఏకంగా 79 శాతం ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి. ఈ విలువైన లోహాన్ని అధికంగా వినియోగించే దేశాల్లో 2వ స్థానంలో ఉన్న ఇండియా ఇలా ఒక్కసారిగా దిగుమతుల్లో భారీ కోత పెట్టడం గ్లోబల్ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. భారతదేశం బంగారం ఇంపోర్టులను తగ్గించటం వల్ల ప్రపంచవ్యాప్తంగా లాభాల దూకుడు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.