శేఖర్ కమ్ముల – రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందిన ‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రియా ఆనంద్. ఆ మూవీలో తన అందం, అభినయంతో చక్కని గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘కో అంటే కోటి’, ‘180’ సినిమాలతో నటిగా మెప్పించింది. కొంత గ్యాప్ తర్వాత ఈ భామ మళ్లీ తన అభిమానుల్ని అలరించనుంది. ‘వరుడు కావలెను’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన లక్ష్మీ సౌజన్య ఇప్పుడు ‘మా నీళ్ల…
ఇప్పుడు టాలీవుడ్ లోని యువ కథానాయకులందరి దృష్టి ఓటీటీలపైనే ఉంది. వెబ్ సీరిస్, ఓటీటీ సినిమాలకు వాళ్ళు పచ్చజెండా ఊపేస్తున్నారు. సినిమాల కోసం ఎదురుచూస్తూ ఖాళీగా ఉండటం కంటే కంటెంట్ ప్రధానంగా రూపుదిద్దుకుంటున్న వెబ్ సీరిస్ చేస్తే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. అలా తాజాగా ఓటీటీ బాట పట్టిన హీరో సుశాంత్. జీ 5 సంస్థ నిర్మిస్తున్న ‘మా నీళ్ళ ట్యాంక్’లో సబ్ ఇన్ స్పెక్టర్ గిరిగా సుశాంత్ నటించాడు. దాదాపు పదేళ్ళ తర్వాత…