Pravasthi Issue: ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమం మీద సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఆమె జడ్జిలుగా వ్యవహరించిన సింగర్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్‌ల మీద అనుచిత ఆరోపణలు చేయడమే కాక, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ గురించి కూడా సంచలన ఆరోపణలు చేసింది. తన వస్త్రధారణ విషయంలో కూడా అన్యాయం జరిగిందని, తన చేత ఎక్స్‌పోజింగ్ చేయించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. తాజాగా ఈ అంశాల మీద జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ…