కూటమి ప్రభుత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు.
Prathipati Pulla Rao: ఏపీ రాజధాని విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా బుద్ధి రాదని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా.. ఏ కోర్టుకు వెళ్లినా అమరావతి ఒక్కటే రాష్ట్రానికి ఏకైక రాజధాని అని ప్రత్తిపాటి పుల్లారావు…
దుగ్గిరాల ఎంపీపీ పీఠం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. దాదాపు సంవత్సరంన్నర కాలం సాగిన ఈ పోరు, ఎట్టకేలకు ముగిసింది. ఈ పీఠం వైసీపీకే దక్కింది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల నేతల మధ్య మళ్ళీ మాటల యుద్ధం మొదలైంది. న్యాయబద్దంగా ఈ సీటు తమకు దక్కిందని వైసీపీ నేతలు చెప్తోంటే.. అప్రజాస్వామికంగా వైసీపీ ఈ సీటుని కొట్టేసిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత పత్తిపాటు పుల్లారావు అవే…
తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో కాకపుట్టిస్తున్నాయి.. వైసీపీ నేతలు కేటీఆర్‌ను టార్గెట్ చేస్తే.. టీడీపీ నేతలు మాత్రం నిజమే అంటున్నారు.. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. ఏపీలో ఉన్న వాస్తవ పరిస్థితులు కేటీఆర్ చెప్పారన్నారు.. అయితే, ఏపీ విధ్వంసం, తెలంగాణ అభివృద్ధి వైఎస్ జగన్ -కేసీఆర్‌ల ఉమ్మడి అజెండాగా ఆరోపించారు. ఒకప్పుడు ఏపీలో ఉన్న భూముల ధరలు 200 శాతం పడిపోతే, తెలంగాణలో గణనీయంగా…