గతేడాది భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఐదో మ్యాచ్‌ని రద్దు చేసిన విషయం తెలిసిందే. టీమిండియా శిబిరంలో కొందరికి కరోనా సోకిందన్న కారణంతో.. ఆ మ్యాచ్‌ని రద్దు చేసి, ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ మ్యాచ్‌ని రీషెడ్యూల్ చేశారు. జులై 1 – 5 మధ్య ఆ చివరి టెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఇందుకు భారత జట్టుని బీసీసీఐ రీసెంట్‌గా ప్రకటించింది. ఇందులో సీనియర్ ఆటగాళ్లైన అజింక్యా రహానె, ఇషాంత్…