(ఆగస్టు 30న రమేశ్ ప్రసాద్ పుట్టినరోజు) ఓ వైపు హైటెక్ సిటీ, మరో వైపు ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ భాగ్యనగరానికి మరింత శోభను తీసుకు వచ్చాయి. ప్రసాద్ సంస్థ తెలుగు చిత్రసీమలోనే కాదు భారతీయ చలనచిత్ర రంగంలోనే ఓ చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ వ్యవస్థాపకులు మరెవరో కాదు ప్రఖ్యాత దర్శకనిర్మాత, నటుడు ఎల్.వి.ప్రసాద్. ఆయన నెలకొల్పిన ప్రసాద్ సంస్థలు అనేకం చిత్రసీమలో వేళ్లూనుకున్నాయి. హైదరాబాద్ లో ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ విషయం అందరికీ తెలిసిందే.…