వెస్టిండీస్ లో ఆగష్టు 22 నుంచి 30 వరకు జరగనున్న మహిళల కరీబియన్ ప్రీమిమర్ లీగ్ (సీపీఎల్) టోర్నమెంట్ లో హైదరాబాద్‌కు చెందిన మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర ఎంపికైంది. ప్రణవి చంద్ర ఆతిథ్య ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరుఫున ఆడేందుకు ఎంపికైంది. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు.