బుర్రా మధుసూదన్. ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే. మూడేళ్లుగా పెద్దగా సమస్యలు లేకుండా రోజులు గడిచిపోయినా.. ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో రివర్స్ కొడుతోందట. ఇన్నాళ్లూ వైసీపీ ద్వితీయశ్రేణి నేతలతో సయోధ్య కుదుర్చుకుని సర్దుబాటు చేసుకున్నారు మధుసూదన్. ఇటీవలే కొత్తగా వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా కట్టబెట్టారు. కానీ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమమే ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నాయట. సమస్యలపై కొందరు.. ఇన్నాళ్లూ ఏమైపోయారు అని ఇంకొందరు ప్రశ్నలు సంధిస్తుంటే.. వారితో వైసీపీ కేడర్ కూడా…
ప్రకాశం జిల్లాలో జరుగుతున్న టీడీపీ మహానాడు 2022 కి భారీ ఎత్తున తరలివచ్చారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఈ సందర్భంగా టీడీపీ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. పొత్తుల గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండానే మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టడం విశేషం. ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్దంగా ఉండాలంటూ రాజకీయ తీర్మానంలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పక్కా వ్యూహాలతో వెళ్లాల్సిన అవసరం ఉందంటూ రాజకీయ తీర్మానంలో…
ఏపీలో జగన్ పాలనపై మహానాడు వేదికగా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మహానాడు 2022లో భాగంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సమావేశంలో ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసంపై తీర్మానం ప్రవేశపెట్టారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి. సీఎం జగనుపై సీరియస్ కామెంట్లు చేశారు సోమిరెడ్డి. వ్యవస్థలపై సీఎం జగనుకు నమ్మకం లేదు. పరిపాలనా వ్యవస్థను జగన్ భ్రష్టుపట్టించారు…. తన తండ్రి హయాంలో జగన్ చేసిన అవినీతికి ఐఏఎస్సులు జైళ్ల పాలయ్యారు. సీఎం హోదాలో ఉన్న జగన్ మాటను…
ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. తాజాగా ఒంగోలు రిమ్స్ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం రేపుతోంది. 20 మందికి పైగా మొదటి సంవత్సరం మెడికల్ విద్యార్థులకు కరోనా పొజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మిగిలిన విద్యార్దులు, అధ్యాపకులు ఆందోళనకు గురవుతున్నారు. మొదటి సంవత్సరంలో మొత్తం 120 మంది విద్యార్థులు వున్నారు. కొంతమందిని హోం ఐసోలేషన్ కు తరలించారు అధికారులు. మరికొంత మందికి రిమ్స్ లోనే చికిత్స అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కరోనా…
ప్రకాశం జిల్లా టంగుటూరులోదారుణ హత్య జరిగింది. బంగారం వ్యాపారి భార్య, కుమార్తెను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. టంగుటూరులో బంగారం వ్యాపారి జలదంకి రవికిషోర్ భార్య శ్రీదేవి(43), కుమార్తె వెంకట లేఖన(21)లతో నివాసం ఉంటున్నారు. రవికిషోర్ సింగరాయకొండ రోడ్డులో ఆర్.కె.జ్యూయలర్స్ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం డిసెంబర్ 3వ తేదీ రాత్రి గం.8-20 సమయంలో భార్యకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేసి…
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఇడుపూరులో నిన్న అపహరణకు గురయ్యాడో విద్యార్ధి. అయితే పోలీసులు పట్టించుకోలేదు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నాసర్ వలి(18) అనే విద్యార్థి అపహరణకు గురయ్యాడు. మధ్యాహ్నం 12 గంటలకు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు రూరల్ పోలీసులు. ఇడుపూరు గ్రామానికి చేరుకొని విచారణ చేస్తున్నారు డి.ఎస్.పి మహంతి కిషోర్ కుమార్, సీఐ ఆంజనేయ రెడ్డి. అదృశ్యమైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.కిడ్నాపైన విద్యార్థి స్నేహితులను విచారిస్తున్నారు డి.ఎస్.పి కిషోర్ కుమార్.…
గ్యాస్ సిలిండర్ లో ఏముంటుంది? ఏంటీ పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా? గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ వుంటుంది. ఆయా సిలిండర్ల బరువును బట్టి గ్యాస్ నింపి వుంటుంది. కానీ కొన్ని గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ మాయం అవుతూ వుంటుంది. కానీ గ్యాస్ సిలిండర్లో నీళ్ళు మీరెప్పుడైనా చూశారా. అవును ఇది నిజం, గ్యాస్ ధరలు పెరిగి సామాన్యుడిపై గుదిబండగా మారిన వేళ నీళ్ళు వస్తే ఆ వినియోగదారుడి పరిస్థితి ఎలా వుంటుందో మీరే ఊహించండి. గ్యాస్ బండ…
ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు కేటుగాళ్ళు అందిన అవకాశాన్ని ఉపయోగించుకుని దోచేస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మణప్పురం గోల్డ్ లోన్ లో చేతివాటం ప్రదర్శించి 14 లక్షలు కాజేశాడో మేనేజర్. బంగారం తమకు అక్కరకు వస్తుందని మణప్పురంలో తనఖా పెట్టారు ఖాతాదారులు. అక్కడ పనిచేసే మేనేజర్ జోసఫ్ రాజ్ మోసానికి పాల్పడ్డాడు. శఠగోపంపెట్టి ఖాతాదారులకు చెందిన 14 లక్షల మేర బంగారం నగలు ఎక్కువ మొత్తంలో లోన్‌గా తీసుకుని మోసం చేశాడు మేనేజర్ జోసఫ్ రాజ్.…
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ్టికి పన్నెండవ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరింది. రైతులు తలపెట్టిన పాదయాత్రకు ఒంగోలు నగరంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అమరావతి రైతులకు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, జనసేన,సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆనాడు అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచుతామనే హామీవల్లే తమ విలువైన భూములు ఇచ్చామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మూడు…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి… ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా.. బలమైన ఈదురు గాలులు కూడా ఇబ్బంది పెడుతున్నాయి.. ఏపీలోని తీర ప్రాంతాల్లో కూడా గంటకు 50-60 కిలోమీటర్ల నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు… అత్యవసరమైతే…