CM KCR: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో విపక్షాల కంటే ముందున్న బీఆర్ ఎస్ దూకుడు పెంచింది.
CM KCR: సీఎం కేసీఆర్ ఇవాళ స్టేషన్‌ఘన్‌పూర్‌కు రానున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్-వరంగల్ హైవేలోని మేడికొండ క్రాస్ రోడ్డు వద్ద శివారెడ్డిపల్లి శివారులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ అసమర్థత వల్లే సింగరేణిలో వాటాను కోల్పోయామని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. సభను ఉద్దేశించి ప్రసంగించారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంథనిలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో రాజకీయ పరిణతి పెరగాలి.. ప్రజస్వామ్య పరిణతి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
CM KCR: ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. రేపు ఖమ్మం నగరంలోని ఎస్ ఆర్ అండ్ బీజీఎన్ ఆర్ కళాశాలలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభకు మంత్రి అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది.. ఆ లక్ష్మీనరసింహుడే మనతో పని చేయించుకున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పోతాయ్ అని ఆనాడు అన్నారని, కరెంటు ఉండదు, చిమ్మ చీకట్లు అవుతాయన్నారని సీఎం గుర్తు చేశారు.
ఆనాడు గోదావరి జలాల కోసం పోరాటాలు చేసిన గడ్డ తుంగతుర్తి అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తుంగతుర్తి సస్యశ్యామలంగా మారింది... కారణం కాళేశ్వరమని సీఎం వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టు నీటిని కూడా త్వరలోనే అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.. ఏం చేశారు, భవిష్యత్‌లో ఏం చేస్తారు అని ఆలోచించాలని కోదాడలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. ఓటు మన చేతిలో బ్రహ్మాస్తమని, పంట పొలాలు ఎండాలా, పండాలా అనేది ఓటు నిర్ణయిస్తుందన్నారు.
గతంలో తెలంగాణ సాధన కోసం అధికార పార్టీని వదిలి ఇంటింటికి తిరిగి 33 ఓట్ల మెజారిటీతో గెలిచానని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. ప్రతీ రోజు కేసీఆర్ పిలుపుతో ప్రజలల్లోకి వెళ్లాను, పల్లె నిద్రలు చేస్తూ ప్రజలతో గడిపానని ఆయన తెలిపారు.
తనకు బీఫాం ఇచ్చి ఆశీర్వదించి సీఎం పంపించారని బీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. తన రాజకీయ జీవితం నియోజకవర్గానికి కేటాయించానని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామన్నారు.