యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీ సెట్స్ పై ఉండగానే ప్రభాస్ 21వ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తాము నిర్మించబోతున్నామని గత యేడాది ఫిబ్రవరి 26న ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ప్రకటించారు. దీపిక పదుకునే నాయికగా నటించే ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని అశ్వినీదత్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అప్పటి…