Off The Record: కాబోయే ఎమ్మెల్సీ విజయశాంతి అక్కడితో ఆగుతారా? లేక అంతకు మించి అంటారా? ఎలాగూ నాది అధిష్టానం కోటా కదా.. ఇంకో అడుగు ముందుకేస్తే పోయేదేముందని ఆమె అనుకుంటే పరిస్థితి ఏంటి? ఎమ్మెల్సీ దక్కించుకున్న ఊపులో కేబినెట్ బెర్త్ మీద కూడా కర్చీఫ్ వేసే అవకాశం ఉందా? ఆ విషయమై కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?.
Off The Record: అంతా మీరే చేశారు.. ఇదో పాపులర్ సినిమా డైలాగ్. అంతా వాళ్లే చేస్తున్నారు. అన్నీ వాళ్ళకేనా? ఇవి తెలంగాణ కాంగ్రెస్‌లో పాపులర్ అవుతున్న క్వశ్చన్స్. వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదన్న సామెత ఆ ఉమ్మడి జిల్లా నేతలకు అచ్చుగుద్దినట్లు వర్తిస్తుందని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో మాట్లాడారు. పలు అంశాలను కూలంకషంగా వివరించారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత వుంది. చెప్పిన మాటకు కట్టుబడి వుంటాం. రాష్ట్ర విభజనపై అవగాహన లేనివారు ఏదో ఒకటి మాట్లాడుతారు. 2009 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ లేదు. కాబట్టి రాష్ట్ర విభజన చేయలేదు. వంక పెట్టారని వచ్చే ఆరోపణల్ని ఖండిస్తున్నా. బిల్లు పెట్టి పాస్ కాకుంటే మొదటికే మోసం వస్తుందని,…