అసెంబ్లీలో విద్యుత్ రంగంపై జరుగుతున్న స్వల్ప కాలిక చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురు దాడి చేస్తున్నాం అనుకుంటున్నారన్నారు. అది రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో తెలియడం లేదు వాళ్లకని విమర్శించారు. గత ప్రభుత్వం వాస్తవాలు ఎప్పుడూ సభ ముందు పెట్టలేదని అన్నారు. విద్యుత్ శాఖను స్కానింగ్ చేసి ప్రజల ముందు పెడతాం.. వాస్తవాలు ఒప్పుకుని.. హుందాగా ఉంటే బాగుంటుందని తెలిపారు. జగదీష్ రెడ్డి విచారణ చేయండి అని సవాల్ విసిరారు.. జ్యుడీషియల్…