కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య ఆదివారం సాయంత్రం గుండెపోటుతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. దక్షిణాది భాషల్లో దాదాపు 500 చిత్రాలలో ఆయన నటించారు. సోమవారం పొట్టి వీరయ్య అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగబోతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా తిరమలగిరి మండలం ఫణిగిరి ఆయన స్వగ్రామం. గట్టు సింహాద్రయ్య, నరసమ్మలకు జన్మించిన వీరయ్య హెచ్.ఎస్.సి. వరకూ చదువుకున్నారు. హైస్కూల్ రోజుల నుండే నటనమీద మక్కువతో నాటకాలు…