గన్నవరం టీడీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ సీనియర్ నేత, గన్నవరం ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి కమిటీ సభ్యుడు పొట్లూరి బసవరావు జన్మదిన వేడుకలు వేదికగా విభేదాలు బయటపడ్డాయి. బసవరావు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎక్కడా కూడా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ఫోటోను ఏర్పాటు చేయలేదు. ఎమ్మెల్యే గన్నవరంలో టీడీపీ సీనియర్ లీడర్లను పక్కన పెట్టారని, వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పెత్తనం చేసిన వారే ఇప్పుడు యార్లగడ్డ దగ్గర పెత్తనం చేస్తున్నారని బసవరావు…