నాలుగు దశాబ్దాల పాటు రెండున్నర వేల చిత్రాలకు పోస్టర్స్ డిజైనర్ గా సేవలందించిన ఈశ్వర్ (84) చెన్నయ్‌లో కన్నుమూశారు. యుక్తవయసులోనే చెన్నయ్ చేరిన ఆయన తొలుత తన సీనియర్స్ దగ్గర పోస్టర్స్ డిజైనింగ్ లో శిక్షణ తీసుకుని 1967లో బాపు దర్శకత్వం వహించిన ‘సాక్షి’ చిత్రంతో సొంత స్టూడియోను ప్రారంభించారు. 2000 సంవత్సరంలో విడుదలైన కోడి రామకృష్ణ ‘దేవుళ్ళు’ చిత్రానికి ఆఖరుగా ఈశ్వర్ వర్క్ చేశారు. సినిమా రంగంలో ఐదు దశాబ్దాల అనుబంధం ఉన్న ఈశ్వర్ పలు…