NIA Raids In Popular Front Of India Case: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) టార్గెట్ గా రాజస్థాన్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. రాజస్థాన్ లోని ఏడు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్ లో భాగంగా కోటాలో మూడు ప్రాంతాల్లో సవాయ్ మాధోపూర్, భిల్వారా, బుండి, జైపూర్ ప్రాంతాల్లో అనుమానితులు నివాస, వ్యాపార స్థలాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.