పోప్ ఫ్రాన్సిస్ (88) మరోసారి పడిపోయారు. దీంతో గడ్డం గాయపడిన వారాల లోపే చేతికి గాయమైంది. దీంతో కుడి చేతికి గాయమైన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోప్ ఫ్రాన్సిస్ గత రెండేళ్ల నుంచి వృద్ధాప్య సంబంధితమైన సమస్యలతో బాధపడుతున్నారు. 2021లో డైవర్టికులిటిస్ అనే వ్యాధి నుంచి బయటపడ్డారు. 2023లో హెర్నియాను సరిచేయడానికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. గత వారం జలుబుతో బాధపడడంతో ఫ్రాన్సిస్ తరపున దౌత్యవేత్తలకు ప్రధాన ప్రసంగాన్ని సహాయకుడి చేత చదివించారు.
ఇది కూడా చదవండి: Bangladesh: బంగ్లా టాప్ ఆర్మీ జనరల్, పాక్ ఆర్మీ చీఫ్‌తో భేటీ.. ఇండియానే లక్ష్యమా..?
పోప్ ఫ్రాన్సిస్ గురువారం తన నివాసంలో పడిపోయారు. దీంతో కుడి చేతికి గాయమైంది. గాయంతోనే షెడ్యూల్ ప్రకారం తన కార్యాలు కొనసాగించినట్లు వాటికన్ తెలిపింది. గురువారం ఉదయం పోప్ సమావేశాలకు వచ్చినప్పుడు కుడి చేతిని పైకి పట్టుకోవడం కనిపించింది. దీంతో పోప్ మరోసారి పడిపోయినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్‌లో కూడా పోప్ పడిపోయారు. అప్పుడు ముఖానికి గాయమైంది. ఆరు వారాల తర్వాత మరోసారి గురువారం గాయపడ్డారు. గురువారం ఉదయం మార్టా హౌస్ దగ్గర పడిపోవడంతో కుడి చేతికి గాయమైనట్లు సమాచారం. ముందు జాగ్రత్తగా కుడి చేతికి కట్టు వేసినట్లు వాటికన్ పేర్కొంది. పోప్ ఫ్రాన్సిస్‌కు ప్రస్తుతం 88 ఏళ్లు. మోకాలి మరియు వెన్నునొప్పి కారణంగా కదలడానికి తరచుగా వీల్‌చైర్‌ను ఉపయోగిస్తారు. డిసెంబర్‌లో మంచం పైనుంచి పడిపోవడంతో ముఖానికి గాయమైంది.
ఇది కూడా చదవండి: Bangladesh: బంగ్లా టాప్ ఆర్మీ జనరల్, పాక్ ఆర్మీ చీఫ్‌తో భేటీ.. ఇండియానే లక్ష్యమా..?