పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్యం ఇంకా సంక్లిష్టంగానే ఉన్నట్లుగా వాటికన్ సిటీ తెలిపింది. గత శుక్రవారం శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూనే ఉన్నారు. మరి కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని వాటికన్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Masthan Sai : మస్తాన్ సాయికి బిగుస్తున్న ఉచ్చు!
ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షలో శ్వాసకోశంలో పాలీమైక్రోబయల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిపింది. దీన్ని నుంచి ఇంకా కోలుకోలేదని తెలిపింది. తాజాగా నిర్వహిచిన టెస్టులను బట్టి మరిన్ని రోజులు ఆస్పత్రి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాటికన్ తెలిపింది. జ్వరం నుంచి అయితే ఫ్రాన్సిస్ కోలుకున్నారని తెలిపింది. ఇక ఫ్రాన్సిప్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు గాజాలోని ఏకైక కాథలిక్ పారిష్ వాకబు చేస్తూనే ఉన్నారు. ఇక సోమవారం పోప్ ఫ్రాన్సిస్ కొంత సేపు పని చేశారని, పత్రాలు కూడా చదివారని వాటికన్ తెలిపింది. ఫ్రాన్సిస్.. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఇది కూడా చదవండి: Gujarat: దారుణం.. మహిళా రోగుల వీడియోలు వైరల్.. ప్రభుత్వం సీరియస్