తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఆయన నెక్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’కి రీమేక్. ఇటీవలే ఈ చిత్రం షెడ్యూల్‌ను ఊటీలో పూర్తి చేశారు. అయితే మెగాస్టార్ చేతికి చిన్న గాయం కావడంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుందని…