తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఆయన నెక్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’కి రీమేక్. ఇటీవలే ఈ చిత్రం షెడ్యూల్‌ను ఊటీలో పూర్తి చేశారు. అయితే మెగాస్టార్ చేతికి చిన్న గాయం కావడంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుందని సమాచారం.
Read Also : సినిమాటోగ్రాఫర్ ట్యాలెంట్ కు పవన్ ఫిదా… పిక్స్ వైరల్
తెలుగు వెర్షన్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు చాలా మంది పేర్లు వచ్చాయి. అందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చింది. అంతేకాదు చిరు సినిమా కోసం ఇంటర్నేషనల్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ పాడడంపై మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో సల్మాన్ ప్రత్యేక పాత్రలో కన్పించబోతున్నట్టు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రివీల్ చేశాడు. ఇటీవల ఒక మీడియా పోర్టల్‌తో మాట్లాడిన సంగీత దర్శకుడు థమన్, చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేయడం అంటే దానికి కొంత ప్రత్యేకతను జోడించాల్సిన అవసరం ఉందని, అందుకే మేకర్స్ బ్రిట్నీ స్పియర్ ను సంప్రదించారని చెప్పారు. దీంతో సల్మాన్ ఈ చిత్రంలో తెలుగు మెగాస్టార్‌తో కలిసి స్టెప్పులేయనున్నాడని, అలాగే అంతర్జాతీయ పాప్ సింగర్ బ్రిట్నీ ఈ సినిమాలో పాట పడబోతోందని క్లారిటీ వచ్చేసింది.