అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది తెలంగాణలో రేషన్ కార్డుల వ్యవహారం. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం రాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ళు గడుస్తున్నా రేషన్ కార్డుల్లో చనిపోయిన వారి పేర్లని తొలగించడం లేదు. దింతో చనిపోయిన వారికి రేషన్ బియ్యం సరఫరా అవుతుండగా.. బతికి ఉన్న వారి పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చక పోవడం తో రేషన్ బియ్యం ఇవ్వడం లేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం తో అర్హులైన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని 2 వేల కు పైగా రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 9 లక్షల 96 వేల 871 మంది రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు అవకాశం ఇవ్వడం లేదు ప్రభుత్వం… దింతో బతికి ఉన్నవాళ్ళ పేర్ల ను రేషన్ కార్డు ల్లో ఎక్కించకపోవడంతో రేషన్ బియ్యం ఇవ్వడం లేదు.చనిపోయిన వారి పేర్లను రేషన్ కార్డుల్లో నుంచి తొలగించడం లేదు.దింతో అనేక సంవత్సరాలుగా చనిపోయిన వారికి కూడా రేషన్ బియ్యం ఇస్తున్నారు.
గతంలో ఎవరైనా చనిపోతే అధికారులు డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన వెంటనే ఆ పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించే వారు.దింతో వారి పేరు మీద సరఫరా అయ్యే బియ్యం ఆగిపోయేవి. కానీ రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులను కొన్నేళ్ళు గా ప్రభుత్వం అనుమతించకపోవడం తో చనిపోయిన వారి పేర్లను తొలగించే ప్రక్రియ ఆగిపోయింది. దింతో నాలుగైదేళ్ల క్రితం చనిపోయిన వారి కి రేషన్ బియ్యం సరఫరా అవుతున్నాయి.ఒక్క సూర్యాపేట జిల్లాలో కరోన టైం లో 12 వందల మంది చనిపోయినట్లు అధికారులు చెపుతున్నారు.సాదారణ మరణాలు సంభవించాయ్.అయిన ఇందులో ఏ ఒక్కరి పేరు ను రేషన్ కార్డు నుంచి తొలగించ లేదు. దింతో వారు కూడా రెగ్యులర్ గా రేషన్ తీసుకుంటున్నట్లు నమోదు అవుతున్నాయి.2017 నుంచి చనిపోయిన వారి పేర్ల మీద రేషన్ బియ్యం తీసుకుంటున్నారు.
ఇటీవల కొత్త రేషన్ కార్డులను జారీ చేసిన ప్రభుత్వం రేషన్ కార్డుల్లో మార్పులు , చేర్పులను పట్టించుకోలేదు. దీంతో కొత్తగా పెళ్లి అయిన వారు, పిల్లలు ఉన్న వారు తమ పిల్లల పేర్లని రేషన్ కార్డుల్లో చేర్చాలని చూసేవారికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే రెషన్ కార్డుల్లో పెరు నమోదు చేయాలంటూ 11 వేల దరఖాస్తు లు పెండింగ్ లో ఉన్నాయి.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు అప్లికేషన్లు పక్కన పెట్టారు. ఇప్పటికైనా రేషన్ కార్డుల్లో మార్పులు , చేర్పులకి ప్రభుత్వం అవకాశం కల్పించి,చనిపోయిన వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించి, బతికి ఉన్న వారి పేర్లను ఎక్కించే అవకాశం కల్పించి రేషన్ కార్డులల్లో అర్హులైన లబ్దిదారులందరికి రేషన్ బియ్యం అందేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Read Also: Gujarat Drugs Case: గుజరాత్ లో డ్రగ్స్ దందా.. రూ.1500 కోట్లపై మాటే