Komatireddy: అప్పుల్లో ఉన్న ఆర్టీసీని గటెక్కించేందుకు పొన్నం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కొత్తగా ఏర్పాటు చేసిన బస్సులను మంత్రులు ప్రారంభించారు. అనంతరం కోమటి రెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ నుంచి హైదరాబాద్ కు ఇక ఏసీ, మూడు డీలక్స్ బస్సులు ఏర్పాటు చేస్తున్నాన్నారు. నల్గొండ నుంచి హైదరాబాద్ కు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడన్నారు. రాష్ట్ర సాధన కోసం స్వపక్షంలో విపక్ష నేతగా ఉన్నారు పొన్నం అని తెలిపారు.
Read also: Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో GOAT సేల్.. 80 శాతం భారీ డిస్కౌంట్స్..
అప్పుల్లో ఉన్న ఆర్టీసీని గటెక్కించేందుకు పొన్నం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. నిజాం కాలం నాటి నార్కెట్ పల్లి బస్ స్టాండ్ ను కాపాడుకుంటామన్నారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆర్టీసీ నీ కాపాడుకుంటామన్నారు. డిమాండ్ కు అనుగుణంగా ఉమ్మడి జిల్లాకు కొత్త బస్సులను త్వరలో కేటాయిస్తామన్నారు. 3035 ఖాళీలకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల నుండి హైదరాబాదుకు ఏసీ బస్సులను నడిపిస్తామని తెలిపారు.
Akshay kumar : నా సినిమాలు ఫ్లాప్ అయితే వారు సెలబ్రేట్ చేసుకుంటారు…