అందుకే నల్ల షర్టు వేసుకున్నా.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు హరీష్ రావు, కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరూ కలిసి మా జిల్లాకు నష్టం చేకూరే పనులు చేస్తున్నారు.. అందుకే నల్ల షర్టు వేసుకున్నానని మంత్రి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరైడ్ కు శాశ్వత పరిష్కారం ఎస్ఎల్బీసీ అన్నారు. ఎస్ఎల్బీసీ, మూసీ శుద్దికరణ విషయంలో ముఖ్యమంత్రిని అభినందుస్తున్నా అన్నారు. ఒక వైపు ఫ్లోరైడ్, మరోవైపు కోటిన్నర…
హైదరాబాద్ కలెక్టరేట్‌లో గోషామహల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజా సింగ్, గణేష్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. 144 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లాలోని రాంపల్లిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దీపావళి పండగ కొత్త ఇంట్లో జరుపుకునేలా పండగకు…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం దసరా పండుగ సందర్భంగా ఎల్లమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక, రాజకీయ, ఆర్థిక సర్వే కోసం జీవో 18ను తీసుకొచ్చారని వివరించారు. ఈ సర్వే 60 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. బీసీ కులగణనను పూర్తిగా సేకరించిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (గ్రామ్ పంచాయతీ ఎన్నికలు) జరుగుతాయని స్పష్టత ఇచ్చారు. కులగణన ప్రక్రియలో రాష్ట్ర ప్రజలు…
కేంద్ర మంత్రి బండి సంజయ్, తాను వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి విషయంలో మాత్రం రాజీలేకుండా పనిచేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లోని మహాశక్తి ఆలయానికి విచ్చేశారు. ఆలయ నిర్వాహకులు పొన్నంకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి మహాశక్తి అమ్మవార్లను దర్శించుకుని…
Ponnam Prabhakar: రైతులు పంటలకోసం తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Ponnam Prabhakar: వాహనదారులకు వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేసారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. సగటున దేశ వ్యాప్తంగా సంవత్సరానికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని.. తెలంగాణలో సగటున రోజుకి 20 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని తెలిపారు. దసరా చెడుపై మంచి విజయం సాధించిన దానికి గుర్తుగా కుటుంబ సభ్యులందరం కలిసి ఈ…
హైదరాబాద్‌లోని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ.. దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్రం నుంచి దసరాకు వెళ్లే ప్రయాణికులు ఇంటి బాట పడతుండటంతో బస్సులు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. శనివారం వచ్చే విజయదశమికి మరికొన్ని రోజులు మాత్రమే ఉండడంతో హైదరాబాద్‌లోని అన్ని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సందడి నెలకొంది. హైదరాబాద్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల కొన్ని జిల్లాలకు ప్రజల భారీ తరలివెళుతున్నారు. ప్రతి ఒక్కరూ శనివారం…
తెలంగాణలోని వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. అత్యంత త్వరలోనే కొత్త వాహన తుక్కు పాలసీని తీసుకువస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. సారధి వాహన్ అనే పోర్టల్ లో 28 రాష్టాలు జాయిన్ అయ్యాయని, తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు జాయిన్ కాలేదన్నారు. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈరోజు నుంచి సారధి వాహన్ పోర్టల్ లో జాయిన్ అవుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొత్త వాహన స్క్రాప్…