ఆ నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కింది. ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్నాయనేంత రేంజ్‌లో నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అధికార-విపక్ష నేతల మధ్య సవాళ్లు-ప్రతిసవాళ్లు నడుస్తున్నాయ్. చిన్న వివాదమే రెండు పార్టీల మధ్య చిచ్చు రేపింది. ఇంతకీ…ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఖమ్మం జిల్లా పాలేరులో ప్రస్తుతం రాజకీయం వేడెక్కుతోంది. అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్ష పార్టీ నేతల పర్యటనలు సాగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ ఇంతలా రాజకీయాలు సాగడం లేదట. ప్రతిపక్ష నేతల…