అసలే ఆళ్లగడ్డ. రాజకీయాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నాళ్లు పొలిటికల్ సందడి తగ్గినా.. ఒక్కసారిగా హైఓల్టేజ్..! పదునైన విమర్శలు.. సవాళ్లు..ఆరోపణలు ఆళ్లగడ్డను అట్టుడికిస్తున్నాయి. ఎందుకిలా? అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? రోడ్ల విస్తరణపై ఆళ్లగడ్డలో రాజకీయ సెగలుకర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ రాజకీయంగా కాక రేపుతోంది. భూమా, గంగుల కుటుంబాల మధ్య ఇప్పటికే రాజకీయంగా విభేదాలు భగ్గుమంటున్నాయి. రోడ్ల విస్తరణలో భాగంగా చేపట్టిన పనులు ఆ విభేదాలకు మరింత ఆజ్యం…