Off The Record: అసలే ఓడిపోయిన బాధలో ఉన్న ఆ పార్టీకి పంచ్‌ల మీద పంచ్‌లు పడుతున్నాయా? ఎద్దు పుండును కాకి పొడిచినట్టుగా సలుపుతోందా? బీఆర్‌ఎస్ టార్గెట్‌గా కవిత చేస్తున్న తాజా కామెంట్స్‌ని ఎలా చూడాలి?
తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యూపీఎఫ్ నిలిచింది. యూపీఎఫ్ నూతన కార్యవర్గంఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. కన్వీనర్ గా బొల్లా శివశంకర్, అడ్వైజర్ గా గట్టు రామచందర్ రావును నియమించారు. అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్ నాయకులతో కవిత సమావేశం నిర్వహించారు. త్వరలోనే బీసీ బిల్లులు సాకారం అయ్యేందుకు కార్యచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.
తండ్రికి కూతురు రాసిన లేఖ బయటకి ఎలా వచ్చింది? అది కూడా రాసిన 20 రోజుల తర్వాత బయట పెట్టడం వెనక వ్యూహం ఏంటి? కేసీఆర్ విషయంలో కవిత కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం.. ఆయనకు ఇబ్బందికరమైన అంశాలు ప్రస్తావించడాన్ని ఎలా చూడాలి? అసలు లేఖను బయటపెట్టిన లీకు వీరులు ఎవరు?