Asaduddin Owaisi : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అందజేసిన చిత్రపటం బహుమతిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కువైట్‌లో భారతీయ ప్రవాసులతో జరిగిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో మాట్లాడిన ఓవైసీ, పాకిస్తాన్ చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని ఉద్దేశిస్తూ, “నకల్ కర్నేకే లియే అకల్ చాహియే” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం.. 18 మంది మావోలు లొంగుబాటు
“2019లో చైనా సైన్యం నిర్వహించిన డ్రిల్‌కు చెందిన ఫోటోను ఇప్పుడు పాక్ సైన్యం ‘ఆపరేషన్ బన్యాన్’ విజయంగా చిత్రీకరించి ప్రధానికి బహుమతిగా ఇస్తున్నారంటే ఎంత దిగజారిపోయారో అర్థం అవుతుంది” అని ఆయన మండిపడ్డారు. పాకిస్తాన్ చేస్తున్న అసత్య ప్రచారాలపై ప్రజలు నమ్మకం పెట్టకూడదని, అధికారిక భారత ప్రభుత్వ ప్రకటనలకే మద్దతు ఇవ్వాలంటూ ప్రవాస భారతీయులకు ఓవైసీ సూచించారు. భారత్ అంతర్జాతీయంగా శక్తిమంతమైన దేశంగా ఎదుగుతున్న వేళ, ఇలాంటి అనాథా ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలన్న ప్రయత్నాలు ఎంత సిగ్గుచేటో అని విమర్శించారు.
TDP Mahanadu 2025: మరలా పెద్ద నోట్లు రద్దు చేయాలి.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!