Vellampalli Srinivas Rao : ప్రతిపక్షంలో ఉండగా కరెంట్ చార్జీలు పెంచమని ప్రతీ వీధికి వెళ్లి తిరిగి మరీ చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలపై పెనుభారం మోపారని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ఈనెల 27వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలసి నిరసన ర్యాలీలు చేపడుతున్నామన్నారు.. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా గడవక ముందే 15,485 కోట్ల భారం మోపారన్నారు. విద్యుత్…
Revanth Reddy Protest: టిపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం (డిసెంబర్ 18, 2024) “చలో రాజ్‌భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఏఐసీసీ పిలుపు మేరకు అదానీ ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మనీ లాండరింగ్ వంటి అంశాలతో పాటు మణిపూర్ అల్లర్లు, విధ్వంసాలపై మోదీ సర్కార్ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఏఐసీసీ. దేశవ్యాప్తంగా ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. Also Read: Today…
Chalo Raj Bhavan: తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకోనుంది. ఈ రోజు హైదరాబాద్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం జరగనుంది. ఈ నిరసనల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అంతటా దేశవ్యాప్త సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ…
విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. లగచర్లకు రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. బీఆర్‌ఎస్, బీజేపీలు వాయిదా తీర్మానాల కోసం డిమాండ్ చేశాయి. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ శాసనసభ్యుల నిరసన మధ్య మూడు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
తమ భూమి తమకే ఉండాలని కొట్లాడిన పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారన్నారు. లగచర్ల ఘటనపై చర్చ పెడదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
లగచర్ల రైతులకు బేడీల విషయంపై అసెంబ్లీ చర్చకు బీఆర్‌ఎస్ పట్టుబట్టింది. పర్యాటక శాఖపై కాకుండా లగచర్ల రైతులకు బేడీల విషయంపై చర్చ చేపట్టాలని బీఆర్‌ఎస్ శాసనసభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్లకార్డులు పట్టుకొని బీఆర్ఎస్ శాసన సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇదేం రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
YSRCP: నేడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర రీజినల్ కో ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకానున్నారు.. పార్టీ బలోపేతం, పార్టీ నిర్మాణంపై దృష్టి సారించనున్నారు వైఎస్ జగన్.. పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై చర్చించనున్నారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా…
AP Legislative Council : ఏపీ శాసనమండలిలో ఈ రోజు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదం సాగింది. ఈ సందర్భంగా, వైఎస్సార్సీపీ సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కళ్లకు కట్టిన చర్యలతో సభను అడ్డగించాలని వారు ప్రయత్నించారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా స్పందించారు. “సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పదజాలంతో…
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాజకీయ ఉత్కంఠత కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ తలపెట్టిన శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సెక్షన్ 30 పోలీస్ శాఖ యాక్ట్ అమలులోకి వచ్చింది. రాజకీయ ర్యాలీలు, ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు పోలీసులు.