Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ చర్చలో ఇటీవల జరిగిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేచింది. విపక్షపార్టీ ఎమ్మెల్యే వివేక్ చేసిన వ్యాఖ్యలపై రవాణా, పౌరసరఫరాల మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. “వివేక్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలి” అని తెలిపారు. వివేక్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదని, ఆయన 2014లోనే అసెంబ్లీకి వచ్చి ఇంకా అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. వివేక్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు.…
ఈ-ఫార్ములా కార్ రేసింగ్ అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దమ్ముంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని వెల్లడించారు. కేబినెట్‌లో మాట్లాడటం సరికాదని.. సభలో చర్చ చేద్దామంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ-కార్ రేసింగ్‌పై విచారణకు గవర్నర్ ఆమోదంపై కేటీఆర్ తొలిసారి స్పందించారు.
వరంగల్ జిల్లా కేటీఆర్ కామెంట్స్‌కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పార్టీ ముఖ్యనాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దొంగలు వస్తున్నారు అని తెలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని, మళ్ళీ వరంగల్ ప్రజలను మోసం చేయడానికి వచ్చారు ఈ దొంగలు అని వ్యాఖ్యానించారు.
కులగణకు బీజేపీ వ్యతిరేకం కాదని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తెలిపారు. ఇవాళ ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు ఓటు వేస్తేనే నరేంద్రమోదీ మూడో సారి ప్రధాని అయ్యారన్నారు. బీసీలలో చీలిక తీసుక రావడానికి రాహుల్ గాంధీ పన్నిన కుట్ర ఇది అని, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడిన మాటలో ఏది వెనక్కి తీసుకోవాలో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పాలన్నారు ఆనంద్ గౌడ్.
ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, రాజ్యాంగం రద్దు చేస్తున్నారని.. అది అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. ఈ ఎన్నికల్లో తాము గెలిచేందుకు ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.…