మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది.. భవనంలోపల గ్రెనేడ్ పడినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఇవాళ రాత్రి పేలుడు సంభవించింది. రాకెట్‌తో నడిచే గ్రెనేడ్ భవనంలోని మూడో అంతస్తులో పడిందని చెబుతున్నారు.. పేలుడు ధాటికి కిటికీలు, డోర్లు ధ్వంసమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాకెట్ లాంచర్ ఉపయోగించి దాడికి పాల్పడినట్టుగా అంచనా వేస్తున్నారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. కార్యాలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు.. సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఘటనా స్థలాన్ని…