Telangana Govt: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా శాఖల్లో బదిలీలు చేపట్టారు. అందులోనూ ప్రధానంగా పోలీసు శాఖలో భారీగా బదిలీలు చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా.. 13 మంది ఐపీఎస్‌లు, ఎక్సైజ్ శాఖలో వివిధ స్థాయిల్లో ఉన్న 105 మందిని బదిలీ చేసింది. 10 మంది అదనపు ఎస్పీలతో పాటు 95 మంది డీఎస్పీలు, ఏసీపీలను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ డీసీపీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా ఎన్‌ఎస్ మోహనరాజా, రామగుండం అదనపు డీసీపీ (ఆపరేషన్స్) వీ.శ్యామ్ బాబు, సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ టీ. స్వామి, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ ముత్యంరెడ్డి, జెన్‌కో అడిషనల్ ఎస్పీ డి ప్రతాప్, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ అదనపు ఎస్పీగా ఆర్ సుదర్శన్ ఉన్నారు.
Reada also: Telangana Weather Today: తెలంగాణలో భానుడి ప్రతాపం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు!
ఆక్టోపస్ అదనపు ఎస్పీగా కె.గంగారెడ్డి, హైదరాబాద్ సిటీ-1 అదనపు డీఎస్పీగా ఎస్.రంగారావు, భూపాలపల్లి అదనపు డీసీపీగా నరేష్ కుమార్, ఆక్టోపస్ అదనపు ఎస్పీ హనుమంతరావులను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ జిందర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు.. ఏసీపీ సీహెచ్ శంకర్ రెడ్డిని మేడ్చల్ ఏసీపీగా బదిలీ చేస్తూ.. ఏసీపీ సామల వెంకట రెడ్డిని సుల్తాన్ బజార్ కు ప్రభుత్వం బదిలీ చేసింది. అంబర్ పేట్ డీఎస్పీ జి.జగన్ ను ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీగా బదిలీ చేయగా, ఆ స్థానంలో ఉన్న ఏసీపీ ఎస్ సైదయ్యను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక.. టీఎస్ ట్రాన్స్ కో డీఎస్పీ కె.శివరాంరెడ్డిని కూడా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇల్లందు డీఎస్పీ చంద్రభాను ఎస్‌డీపీఓగా బదిలీ అయ్యారు. డీఎస్పీ కృష్ణయ్యను ఎల్బీనగర్ ఏసీపీగా ప్రభుత్వం బదిలీ చేసింది.
Komuravelli Railway Station: నేడు కొమురవెల్లిలో రైల్వేస్టేషన్.. నిర్మాణానికి కిషన్ రెడ్డి భూమిపూజ