మధ్యప్రదేశ్ లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 12 సంవత్సరాలుగా డ్యూటీ చేయకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్న కానిస్టేబుల్ ఉదంతం బయటపడింది. ఈ కేసు 2011లో నియమితులైన విదిష జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారిది. నియామకం తర్వాత.. అతన్ని భోపాల్ పోలీస్ లైన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఆపై సాగర్ శిక్షణా కేంద్రానికి పంపారు. కానీ శిక్షణకు హాజరు కావడానికి బదులుగా, అతను విదిషలోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఏ అధికారికి సమాచారం…