ఆయుధాల అక్రమ రవాణా వ్యవహారంలో పంజాబ్ పోలీసులకు చిక్కిన ఉగ్ర అనుమానితులను తెలంగాణకు తీసుకురానున్నారు. పంజాబ్‌లోని కర్నాల్‌లో అక్కడి పోలీసులు ఈ నెల 5న నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారికి పాకిస్థాన్‌లో ఉంటూ ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది రింధాతో సంబంధమున్నట్లు విచారణలో తేలింది. వారిలో భూపేంద్రసింగ్, పర్మేందర్‌సింగ్‌లను విచారణ అనంతరం తిరిగి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు అమన్‌దీప్ సింగ్, గురుప్రీత్ సింగ్‌లను న్యాయస్థానం అనుమతితో ఆదిలాబాద్‌కు…