పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసు అధికారులు మరణించారు. పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ బాంబు దాడిని ఖండించారు. ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలోని ట్యాంక్ జిల్లాలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. మరణించిన వారిలో స్థానిక పోలీసు చీఫ్ ఇషాక్ అహ్మద్ ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు అందించడానికి పోలీసు అధికారులు నిరాకరించారు. ఈ దాడికి ఏ సంస్థ ఇంకా బాధ్యత వహించలేదు.…