KPHB Mur*der: భర్తను హత్య చేసి పాతిపెట్టిన భార్య.. రెండు రోజుల్లో కేసు చేధించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KPHB Mur*der: ఈ మధ్యకాలంలో దేశంలో చాలా చోట్ల భర్తలను భార్యలు వివిధ రకాలుగా చంపేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్ర హిల్స్ లో భర్తను చంపి పాతిపెట్టిన కేసులో పోలీసులు ఫిర్యాదు అందిన రెండు రోజుల్లోనే కేసును చేదించారు. నిందితులు కవిత, ఆమె సోదరి జ్యోతి, మరిది మల్లేష్ లను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాసరావు హత్య ఘటనకు సంబంధించి వివరాలను వెల్లడించారు.
ఈ హత్య పథకం ప్రకారం మృతుడైన సాయిలును నగరానికి తీసుకువచ్చి జ్యోతి, మల్లేష్ ఇంటి వద్ద అవకాశం కోసం ఎదురు చూసి శుక్రవారం మద్యం తాగించి హత్యచేశారని తెలిపారు. హత్యకు ముందు పథకం ప్రకారం సాయిలుకు విద్యుత్ షాక్ ఇచ్చి చంపేందుకు యత్నించింప్పటికి, ప్రాణం ఉండటంతో గొంతు నులిమి, వృషణాలపై దాడి చేసి హత్య చేశారు. అయితే ఈ విషయం ఆటో డ్రైవర్ ఇచ్చిన పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆటో బుక్ చేసిన ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరించి సాయిలు హత్య ఉదంతాన్ని తెలుసుకున్నారు పోలీసులు. దానితో నిందితులు కవిత, జ్యోతీ, మల్లేష్ లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
కవిత, అతని కుటుంబ సభ్యుల నుంచి అవమానకరమైన ప్రవర్తనను తట్టుకోలేక కవిత సాయిలును అంతమొందించేందుకు ప్లాన్ వేసి అమలు చేసారని తెలిపారు. హత్యకు మల్లేష్, జ్యోతి సహకరించినట్లు వెల్లడించారు అధికారులు. హత్య అనంతరం మృతదేహాన్ని సంగారెడ్డి జోగిపేట తరలించాలని ఆటో మాట్లాడుకుని అక్కడికి వెళ్లిన అనంతరం స్మశాన వాటిక వద్ద కుర్చీ విషయంలో గొడవ జరిగింది. అయితే, ఎక్కడి నుంచి తీసుకొచ్చానో అక్కడే దింపుతానని డ్రైవర్ చెప్పడంతో మృతదేహన్నీ కవిత మిత్ర హిల్స్ తీసుకొచ్చారు. మిత్ర హిల్స్ పక్కనే ఉన్న అలీతలాబ్ చెరువు సమీపంలో మృతదేహాన్ని పూడ్చి పెట్టి అక్కడ నుంచి సొంత గ్రామానికి వెళ్లి సాయిలు పనికి వెళ్లి రాలేదని అందరిని నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. ఆటో డ్రైవర్ వల్లి నాయక్ ఫిర్యాదుతోనే ఈ కేసు బయటకు వచ్చిందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు