Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు తిలక్‌నగర పీఎస్ పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Case File: జనగామలో ముగ్గురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కంచె రాములుపై డిసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సుపారీ ప్లాన్ చేశారని కంచే రాములతో పాటు అదే పార్టీకి చెందిన రాగుల శ్రీనివాస్ రెడ్డి డీసీపీకి ఫిర్యాదు చేసారు. 24 గంటల గడవక ముందే యూటర్న్ తీసుకున్నాడు సదరు నాయకుడు శ్రీనివాస్ రెడ్డి. తనకు ఎలాంటి సంబంధం లేదని, సుపారీ ప్లాన్ లో ఎలాంటి నిజం లేదని…
కొత్త ఫోన్ కొనుక్కోవడమే ఆ బాలుడికి శాపమైంది. కొత్త మొబైల్ కొన్న ఆనందం ఎంతో సేపు లేకుండానే ఆవిరైపోయింది. స్నేహితుల దుర్బుద్ధి కారణంగా ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఓ తల్లికి కడుపుకోత మిగిల్చారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని షకర్‌పూర్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
విజయవాడలోని అశోక్‌నగర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగి ఏడాదిన్నర చిన్నారి మృతిచెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ పడమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Chinmayi Sripada: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణల విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఈ విషయంపై తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించింది. ఆవిడ పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ ..‘రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడని., ఈ కేసులో ఆ అమ్మాయి పోరాడేందుకు కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చిన్మయి ట్వీట్ చేశారు. ఇకపోతే ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద…
Ganesh Immersion: అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పోకనాటి వీధి వినాయకుడి ఊరేగింపు ప్రారంభమైన కాసేపటికే డీజే సౌండ్ బాక్సుల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీకి చెందిన పాటలు వేయడంపై బి. కొత్తకోటలో పోలీసులు కేసు నమోదు చేశారు.
తిరుపతిలో వినాయక చవితి ఉత్సవాలలో రికార్డింగ్ డాన్స్, అశ్లీల నృత్య ప్రదర్శనలు చేశారు.. అయితే, దీనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. అంతేకాదు.. 7 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు అలిపిరి పోలీసులు..
Gun Fire In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఓ క్లబ్ వెలుపల ఆయుధాలతో దుండగులు కాల్పులు జరిపారు. దుండగులు తొలుత బౌన్సర్లను మోకరిల్లేలా చేసి ఏరియల్ ఫైరింగ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబరు 5న ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో…
FIR On Teacher: ఛత్తీస్‌గఢ్ బల్‌రాంపూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన ఉపాధ్యాయుడిపై రఘునాథ్‌నగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. చెంపదెబ్బ కొట్టిన తర్వాత విద్యార్థి వినికిడి శక్తి కోల్పోయాడు. విద్యార్థికి చెవిలో సమస్య ఏర్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం ప్రకారం, బలరాంపూర్ జిల్లాలోని పండరి హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి శుక్రవారం తన చొక్కా చేతులు ముడుచుకుని పాఠశాలకు చేరుకున్నాడు. దీనిపై అక్కడ…
Ganja Smuggling: తాజాగా ఏపీలో 300 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. కంచికచర్ల పట్టణ శివారు ప్రాంతం 65వ జాతీయ రహదారి పై 300 కేజీల గంజాయిని పట్టుకున్నారు కంచికచర్ల పోలీసులు. ఈ సందర్బంగా కంచికచర్ల పోలీసు స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు నందిగామ ఏసిపి రవి కిరణ్. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం అటవీ ప్రాంతం నుంచి 300 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కారులో ముంబైకి అక్రమంగా తరలిస్తున్నట్లు…