Kachiguda Railway Track : హైదరాబాద్ నగరంలో గురువారం చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. కాచిగూడ రైల్వే ట్రాక్ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి ఓ కారు నిలిపివేయడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రైల్వే మార్గంలో కారు కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే కాచిగూడ పోలీసులు, రైల్వే సెక్యూరిటీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రైల్వే ట్రాక్‌పై నిలిచిన కారును అక్కడి నుంచి తొలగించేందుకు…
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని డిండి ప్రాజెక్ట్ వద్ద వరద ఉధృతి పెరిగింది. డిండి ప్రాజెక్ట్‌కు దుందుభి నది నుంచి భారీగా వరద నీరు చేరుతోంది.
ఛత్తీస్‌ఘఢ్‌లో ఎన్‌కౌంటర్‌ల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు 10 రోజులు ఎలాంటి పర్యటనలు పెట్టుకోవద్దని పోలీస్ శాఖ సూచనలు చేసింది. ఎమ్మెల్యేను నేరుగా కలిసేందుకు కూడా రావద్దని, ఫోన్ లో సంప్రదించాలని ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Game Changer Pre-Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. జనవరి 2న సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ మెగా అభిమానులకు విపరీతంగా నచ్చింది. అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా ఉన్న ట్రైలర్ విడుదల కావడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే నేడు (జనవరి 4)వ తేదీన రాజమండ్రి వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ…
Ananya Nagalla : ఈ మధ్యకాలంలో ప్రపంచంలో సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయన్న సంగతి అందరికీ తెలిసింది. తరచుగా ప్రపంచంలో చాలా చోట్ల సైబర్ మోసాల వల్ల అనేకమంది డబ్బులను పోగొట్టుకోవడమే గాక వాటి వల్ల జరిగిన అనర్ధాల వల్ల ప్రాణాలను కూడా కోల్పోయిన వారు చాలానే ఉన్నారు. ఈ విషయంలో పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నా.. కొంతమంది వారి వలలో చిక్కుకొని నష్టపోతున్నారు. ఇకపోతే తాజాగా టాలీవుడ్ చెందిన హీరోయిన్ సైబర్ మోసగాళ్లకు టార్గెట్…
ఏపీ పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది.
విజయదశమి పండుగ సమయంలో టీడీపీ నిరసనలపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసుల అలర్ట్ అయ్యారు. జగనాసుర దహనం పేరిట నిరసనలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నిరసనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉందని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
PFI కార్యకర్తల దాడులపై తెలంగాణా ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది. కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై PFI దాడులు చేసేందుకు కుట్ర చేస్తోందని, PFI, దాని అనుబంధ సంస్ధలపై నిఘా ఉంచాలని హెచ్బరికలు జారీ చేసింది.