ఈ రోజు కేంద్రం నుండి విడుదలైన రూ.12 వేల కోట్లు గతంలో వైఎస్ జగన్ చేసిన కృషి వల్లే వచ్చాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అసత్యాలను చెప్తున్నారన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తి పడ్డారని.. అందుకే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు.
పోలవరంకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం మొదటి దశ నిర్మాణానికి అవసరమైన రూ. 12,500 కోట్ల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో.. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ, పోలవరం విషయంలో కేంద్రం చొరవ చూపుతోందని అన్నారు. ఏపీ అభివృద్ధి విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని తన చర్యల ద్వారానే చెబుతోందని తెలిపారు. కేంద్రం స్పందిస్తున్న తీరు చూస్తుంటే సంతోషం వేస్తోందని.. పోలవరాన్ని…
ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా.. పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం మొదటి దశ నిర్మాణానికి అవసరమైన రూ. 12,500 కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్…