Mehul Choksi Extradition: భారతదేశానికి చెందిన ఆర్థిక మోసగాడు మెహుల్ చోక్సీ దేశం వదిలి పారిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన గురించి బెల్జియం కోర్టు నుంచి ముఖ్యమైన వార్తలు వచ్చాయి. చోక్సీని భారతదేశానికి అప్పగించడానికి ఆంట్వెర్ప్ కోర్టు ఆమోదం తెలిపింది. భారత ఏజెన్సీల డిమాండ్ చెల్లుబాటు అయ్యేదని, బెల్జియం పోలీసుల అరెస్టు చట్టబద్ధంగా సరైనదేనని కోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. ఈ నిర్ణయంతో భారత ఏజెన్సీలు CBI, ED లు ఒక పెద్ద చట్టపరమైన…
Nehal Modi: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారీ నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీని అమెరికాలో అధికారులు అరెస్ట్ చేశారు. భారత అప్పగింత అభ్యర్థన మేరకు అమెరికా అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. నేహాల్ మోడీని కోట్లాది రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణానికి సంబంధించి అమెరికాలో అరెస్టు చేశారు, ఇది భారతదేశానికి పెద్ద దౌత్య విజయం. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం, బెల్జియన్ జాతీయుడైన నేహాల్ మోడీని జూలై 4న అదుపులోకి తీసుకున్నారు.
బ్యాంకు రుణాల ఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి సంబంధించిన కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పురోగతి సాధించారు. నీరవ్‌కు సంబంధించిన ₹253.62 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఈ జాబితాలో చరాస్థులైన రత్నాలు, ఆభరణాలతో పాటు బ్యాంకు డిపాజిట్లు కూడా ఉన్నాయని ఈడీ అధికారులు వెల్లడించారు.