PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌కి బిగ్ మెసేజ్ పంపించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిన విషయం తెలిసింది. మంగళవారం, సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ పరోక్షంగా పాకిస్తాన్‌ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇకపై భారతదేశ నీరు భారత్ కోసమే ప్రవహిస్తుంది. భారతదేశం కోసమే ఆగిపోతుంది, భారతదేశానికి మాత్రమే ఉపయోగిపడుతుంది’’ అని అన్నారు. ‘‘ఈరోజుల్లో మీడియాలో నీటి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. గతంలో, భారతదేశ హక్కుగా…
కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతమవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి మద్ధతుగా నిలుస్తామన్న ప్రధాని వ్యాఖ్యలు మరింత నమ్మకాన్ని నింపాయన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సభ సక్సెస్ అయిందని వ్యాఖ్యానించారు. సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందని తెలిపారు.
Amaravati Restart Event Live Updates: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం మొదలు కానుంది.
18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీతో సహా కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ మీడియాతో మాట్లాడుతూ మూడోసారి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పని చేస్తామని, మూడో దశ లో మూడు రెట్లు ఎక్కువగా పనిచేస్తామని చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్‌పై విరుచుకుపడిన మోదీ, ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. 50 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని గుర్తుచేశారు. మంచి విపక్షం అవసరం అని,…
కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ తక్షణ చర్యలకు సిద్ద పడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అలానే భారతీయ కార్మికుల రక్షణ కోసం కీర్తి వర్ధన్ సింగ్‌ను ఆదేశించారు, అయితే అగ్నిప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 40 మంది భారతీయ కార్మికులు మరణించారు. ఇదిలా ఉంటే ఏపీలో చంద్రబాబు, ఒడిషాలో మోహన్ మాఝీ ప్రమాణస్వీకారానికి హాజరైన మోడీ తక్షణ ఢిల్లీకి చేరి, వివరాలు అడిగి తెలుసుకోబడింది. మరింత సమాచారం కొరకు కింది…
జీ7 సమావేశాల సమయంలో ప్రధాని మోదీ ఇటలీకి ప్రయాణిస్తున్న సందర్భంగా, ఖలిస్తానీ మద్దతుదారులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ ఇటలీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 13 న ఇటలీకి బయలుదేరి జూన్ 14 సాయంత్రం తిరిగి వస్తారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మరియు ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్‌లతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి…
ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతాను సైతం సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. కొంత సమయం వరకు హ్యాక్ అయింది.ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. అయితే కొంత సేపటి తర్వాత ట్విట్టర్ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది. మోడీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో దుండగులు బిట్ కాయిన్‌ను ఉద్దేశిస్తూ పోస్టులు చేశారు. భారత ప్రభుత్వం 500 బిట్ కాయిన్‌లను కొనుగోలు చేసి ప్రజలకు పంచుతున్నారని హ్యకర్లు వాటికి సంబంధించిన లింక్‌లను పోస్ట్ చేశారు. దీంతో వెంటనే పీఎంవో అధికారులు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ రెబల్ ఎంపీ రాఘురామ కృష్ణం రాజు మరో సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశాడు. లేఖ లో వైసీపీ ప్రభుత్వం పై ఎంపీ రాఘు రామ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధికంగా అప్పులు చేసిందని ఈ సారి లేఖలో ప్రధాన మంత్రికి తెలిపారు. కార్పొరేషన్ల పేరుతో అనేక చోట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంటుందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్యారంటీ అప్పులు రూ. 1.35…
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ త్రిపుర హింసాకాండ, బీఎస్ఎఫ్ అధికార పరిధి అంశాలను చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీతో బుధవారం భేటీ అయ్యా రు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంకా రూ.96,605 కోట్లు రావాల్సి ఉంది అన్నారు. అంతే కాకుండా బెంగాల్ BSF అధికార పరిధి గురించి మాట్లాడుతూ.. “BSFకు విస్తృత అధికారాలు ఇచ్చినట్లయితే అది శక్తిమంతం అవ్వడమే కాకుండా రాష్ట్రంలో శాంతి…
దేశ వ్యాప్తంగా 22.45 కోట్లకుపైగా టీకా డోసుల నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. మిగులు డోసులు ఉండటం తో టీకా వాణిజ్యపర ఎగుమతులపై కేంద్రప్రభుత్వం త్వరలోనే నిర్ణ యం తీసుకునే అవకాశం ఉంది. నవంబర్ నెలలో దాదాపు 31 కోట్ల డోసుల్ని డెలివరీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 20నుంచి 22 కోట్ల డోసుల కంటే ఎక్కువ పంపిణీ చేస్తాయని అనుకోవడం లేదు. మిగిలిన వాటిని ఎగుమతి చేస్తామని సంబంధిత అధికారి ఒకరు…