పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత సొమ్మును ప్రధాని మోడీ మంగళవారం ఇవాళ సివ్లూలో విడుదల చేయనున్నారు. దాదాపు పది కోట్లు మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 21,000 కోట్లను జమచేయనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఆజాదీకా అమృత మహోత్సవ్ సందర్భంగా నిర్వహిస్తున్న గరీబ్ కల్యాణ్ సమ్మేళనంలో ఈ మొత్తాన్ని విడుదల చేస్తారని చెప్పారు. తొమ్మిది కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన 16 పథకాల లబ్ధిదారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో నేరుగా ముచ్చటిస్తారని…