నరేంద్ర మోడీ.. దేశ ప్రధానిగా మూడోసారి ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7:30 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా మోడీ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మోడీచే ప్రమాణం చేయించనున్నారు.
Lok Saha Election Result: ఎన్నికలకు ముందు 400 దాటాలని ప్రధాని నరేంద్ర మోడీ నినాదాలు చేశారు. అయితే నేడు దేశవ్యాప్తంగా ఈవీఎంలు తెరుచుకునే సరికి బీజేపీ 250 సీట్లలోపే ఇరుక్కుపోయిందని అన్నారు.
PM Modi: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలని ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం (మే 30) కన్యాకుమారి లోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద దాదాపు రెండు రోజుల ధ్యాన వ్యాయామాన్ని మొదలు పెట్టనున్నారు. మోడీ కార్యక్రమం నేపథ్యంలో జిల్లాలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ గుహలో ప్రధాని ఇలాంటి ధ్యానాన్ని చేపట్టారు. ధ్యాన్ మండపంలో మోడీ 45 గంటలపాటు బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన…
Pakistan: పాకిస్తాన్ మాజీ మంత్రి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడిగా పేరున్న ఫవాద్ హుస్సేన్ చౌదరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవాలని తన అక్కసును వెళ్లగక్కాడు.
Nitish Kumar: జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ నోరు జారారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అనుకోకుండా ప్రధాని నరేంద్రమోడీ మళ్లీ ‘ముఖ్యమంత్రి’ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. ఐదో విడత మే 20న జరగనుంది. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు చేశారు.