PM Modi Oath Ceremony LIVE Updates: మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 7.15 నిమిషాలకు ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు పలువురు ఎన్డీయే నేతలు ఈ రోజు ఉదయం ప్రధాని మోడీ నివాసంలో కలిశారు. చిరాగ్ పాశ్వార్, పీయూష్ గోయల్, జై శంకర్, శివరాజ్ సింగ్ చౌహాన్, హెచ్‌డీ కుమారస్వామి మోడీని కలిసిన నేతల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఇరుగుపొరుగు దేశాలకు చెందిన దేశాధినేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో సహా పలువురు అంతర్జాతీయ దేశాధినేతలు హాజరుకానున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ఛీప్ మల్లికార్జున ఖర్గేని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఇప్పటికే ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. జీ-20 సదస్సు మారిరిగానే మల్టీ లెవల్ భద్రతనను ఏర్పాటు చేశారు. డ్రోన్లు, స్నైపర్స్, పారామిలిటరీ సిబ్బంది, ఎన్ఎస్‌జీ కమాండోలు రాష్ట్రపతి భవన్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఐదు కంపెనీల పారామిలిటరీ, ఢిల్లీ సాయుధ పోలీసుల జవాన్లలో సహా 2,500 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఢిల్లీలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గగనతల ఆంక్షలు విధించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథులు సాయంత్రం 5 గంటల నుండి రావడం ప్రారంభిస్తారు మరియు 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం ప్రారంభమవుతుంది.
కేంద్ర మంత్రిగా సోమన్న ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రులుగా నిత్యానంద్‌రాయ్, అనుప్రియా పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. వారితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రులుగా రామ్‌దాస్, రామ్‌నాథ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేశారు. వారితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రులుగా పంకజ్ చౌదరి, క్రిషన్ పాల్ ప్రమాణ స్వీకారం చేశారు. వారితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రులుగా జితిన్ ప్రసాద్, శ్రీపాద యశో నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు. వారితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రులుగా ప్రతాప్ జాదవ్, జయంత్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. వారితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా జితేంద్ర సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా రావు ఇంద్రజిత్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఎన్డీయే మిత్రపక్షం అప్నాదళ్ పార్టీ నేత అనుప్రియా పాటిల్ కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్రమోడీకి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అభినందనులు తెలియజేశారు. హెల్త్, వ్యవసాయం, మహిళల అభివృద్ధి, డిజిటల్ టాన్స్‌ఫర్మెషన్‌లో మీరు ఇండియా స్థానాన్ని మరింత బలోపేతం చేశారు. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి నిరంతర భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాం.
Congratulations to @narendramodi on winning a third term as Prime Minister. You have strengthened India's position as a source of innovation for global progress in sectors like health, agriculture, women-led development, and digital transformation. Look forward to a continued…
— Bill Gates (@BillGates) June 9, 2024
కేంద్ర మంత్రిగా సీఆర్ పాటిల్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా చిరాగ్ పాశ్వాన్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా మన్సుఖ్ మాండవీయ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా హర్‌దీప్ సింగ్ పూరి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా కిరణ్ రిజిజు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా అన్నపూర్ణ దేవి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా గజేంద్ర షెకావత్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా భూపేంద్ర యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా అశ్వినీ వైష్ణవ్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా గిరిరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా జువల్ ఓరమ్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా ప్రహ్లాద్ జోషి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా వీరేంద్ర కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా సర్బానంద సోనోవాల్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా లలన్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా జీతన్ రామ్ మాంఝీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా పీయూష్ గోయల్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా సుబ్రహ్మణ్యం జైశంకర్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు
కేంద్ర మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా మోడీ కేబినెట్‌లోకి చేరారు. కేంద్ర మంత్రిగా జేపీ నడ్డా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా నితిన్ గడ్కరీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిగా అమిత్ షా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
కేబినెట్ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ ప్రమాణం చేశారు. ప్రధాని ప్రమాణస్వీకారం అనంతరం రాజ్‌నాథ్‌తో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు.
ప్రధానిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోడీ. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. నరేంద్ర దాస్ మోడీ అనే నేను.. అంటూ ప్రధాని ప్రమాణ స్వీకారాన్ని ప్రారంభించారు.
రాష్ట్రపతి భవన్‌కు ప్రధాని మోడీ చేరుకున్నారు. వచ్చిన నేతలందరికీ ఆయన అభివాదం చేశారు. ఆయన కేబినెట్‌లోని మంత్రులు వేదికపైకి చేరుకున్నారు. ఆయనతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొద్ది క్షణాల్లో ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
#WATCH | Delhi | Prime Minister-designate Narendra Modi to take oath for the third consecutive term as the Prime Minister along with his Cabinet, shortly pic.twitter.com/XjtYOeDhX4
— ANI (@ANI) June 9, 2024
ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి తన భార్యతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
#WATCH | Sri Lankan President Ranil Wickremesinghe arrives at Rashtrapati Bhavan to attend the oath ceremony of Prime Minister-designate Narendra Modi pic.twitter.com/gKDihmth4A
— ANI (@ANI) June 9, 2024
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
#WATCH | Bangladesh PM Sheikh Hasina arrives at Rashtrapati Bhavan to attend the oath ceremony of Prime Minister-designate Narendra Modi pic.twitter.com/BcwfMmTSLs
— ANI (@ANI) June 9, 2024
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ కాబోయే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
#WATCH | Maldives President Mohamed Muizzu arrives at Rashtrapati Bhavan to attend the oath ceremony of Prime Minister-designate Narendra Modi pic.twitter.com/o4V8rcHtRo
— ANI (@ANI) June 9, 2024
రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ హాజరయ్యారు.
#WATCH | BJP leader Smriti Irani at the Forecourt of Rashtrapati Bhavan for the oath ceremony. pic.twitter.com/FRkiycbmnP
— ANI (@ANI) June 9, 2024
మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్, తన భార్యతో కలిసి ప్రధాని మోడీ ప్రమాణస్వీకారం కోసం రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు.
#WATCH | Mauritius Prime Minister Pravind Jugnauth arrives at Rashtrapati Bhavan to attend the oath ceremony of Prime Minister-designate Narendra Modi pic.twitter.com/golA9HSR86
— ANI (@ANI) June 9, 2024
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తన భార్యతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేశారు.
#WATCH | CJI DY Chandrachud along with his wife arrive at the Forecourt of Rashtrapati Bhavan for the oath ceremony pic.twitter.com/xxkkHpZtuc
— ANI (@ANI) June 9, 2024