KTR: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి జిల్లా మీద ప్రేమ ఉంటే వెంటనే తీర్మానించాలని డిమాండ్ చేశారు. నారాయణ పేట స్టేడియం గ్రౌండ్ లో ప్రగతి నివేదన సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
DR.Laxman: తెలంగాణలో ఎక్కడ చూసినా.. డ్రగ్స్, లిక్కర్ మాఫియా నడుస్తుందని ఎంపీ డా. కె. లక్ష్మణ్ ఆరోపించారు. పల్లెల్లో యుక్త వయసులోనే మహిళలు వితంతువులవుతున్నారని..దీనికి కారణం గ్రామాల్లో మద్యం ఏరులై పారడమే అని ఆవేదన వ్యక్తం చేశారు.
పరాక్రమ్ దివస్ సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు మీదుగా అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 పెద్ద పేరులేని దీవులకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టారు.
Asaduddin Owaisi: హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చే శారు.. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశ పార్లమెంట్లో అన్ని వర్గాల ఎంపీలు ఎన్నికై వస్తారు.. కానీ, ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా ఓ లీడర్ కింద ఎదగడం రాజకీయ పార్టీలకి నచ్చదని విమర్శించారు.. దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకి బానిసలుగా ఉండాలని పార్టీల నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు.. 70 ఏళ్లుగా మమ్మల్ని ఇదే విధంగా దోచుకున్నారని…
పరీక్షల కారణంగా ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు ప్రధాని మోదీ విద్యార్థులకు గైడెన్స్ ఇస్తూ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ ప్రోగ్రామ్.. 2023లో కూడా జరగనుంది.
రోజ్‌గార్ మేళా కింద వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన వారికి 71,000 నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పంపిణీ చేశారు.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో 1,000 మందికి పైగా ముస్లింలు మరణించిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసి) మంగళవారం 'ఇండియా: ది మోడీ క్వశ్చన్' అనే డాక్యుమెంటరీని విడుదల చేసింది.
ప్రధాని మోడీ దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా అత్యున్నత, అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు అని అభివర్ణిస్తూ.. ఆయన ఆధ్వర్యంలో భారత్ ప్రపంచ భవిష్యత్‌కు రక్షకుడిగా ఉద్భవించిందని బీజేపీ జాతీయ కార్యవర్గం ఆమోదించిన రాజకీయ తీర్మానం అభివర్ణించింది.