ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన లక్షద్వీప్ పర్యటన గురించి తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రధాని మోడీ తన పర్యటనకు సంబంధించిన పలు చిత్రాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. ఫోటోల్లో ప్రధాని మోడీ విభిన్న స్టైల్స్‌లో కనిపిస్తున్నారు. ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో రూ.1,156 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు.