టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఫోటోల ఫ్లెక్సీల యుద్ధం ఈ నాటిది కాదు.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ.. హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటన సమయంలో ఇది స్పష్టంగా కనిపించింది.. సోషల్ మీడియాలోనూ.. పెద్ద రచ్చే జరిగింది.. అయితే.. ఇప్పుడు.. మరోసారి అలాంటి యుద్ధానికి తెరలేపారు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్… శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆమె.. బీర్కూరు మండల కేంద్రంలోని చౌక ధరల దుకాణంలో పేదలకు ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని తనిఖీ చేశారు. లబ్దిదారులతో మాట్లాడారు..…