భారతీయులందరికీ ఈరోజు ముఖ్యమైన రోజు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రధాని మోడీతో కలిసి ఆయోధ్య రామాలయంపై కాషాయ జెండాను మోహన్ భగవత్ ఆవిష్కరించారు
అయోధ్య రామమందిరంపై కాషాయ జెండాను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎన్నో ఏళ్ల సంకల్పం ఈరోజు నెరవేరిందని తెలిపారు. ధ్వజారోహణతో ఎన్నో ఏళ్ల నాటి గాయాలు మానిపోయాయని చెప్పుకొచ్చారు. రామమందిర నిర్మాణానికి సహకరించిన ప్రతి భక్తుడికి నివాళులు అర్పిస్తున్నానన్నారు.
అయోధ్య శ్రీరామ్‌లల్లా ఆలయంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామాలయంపై 22 అడుగుల కాషాయ జెండాను మోడీ ఆవిష్కరించారు. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది. సాధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..! ‘‘ధ్వజ్ ఆరోహణ్’’…