మరో మూడు రోజుల్లో రాఖీ పండుగ రాబోతోంది. అన్నా చెళ్లెల్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు చిహ్నంగా రక్షబంధన్ నిలుస్తోంది. ఈ ఏడాది కూడా రాఖీ పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రక్షా బంధన్ సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముస్లిం సోదరి ఖమర్ మొహ్సిన్ షేక్ మరోసారి ఆయన కోసం రాఖీని సిద్ధం చేశారు. పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించిన ఖమర్ షేక్ గత 30 సంవత్సరాలుగా ప్రధాని మోడీకి రాఖీ కడుతున్నారు.…