ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గణపవరంలో ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10.10 గంటలకు గణపవరం చేరుకోనున్న సీఎం.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం ముగిశాక తిరిగి 1 గంటకు తాడేపల్లికి…