Rahul Gandhi: ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ ప్రధానమంత్రిని సంయుక్తంగా ప్రకటిస్తామని ఈ రోజు అన్నారు.
Rahul Gandhi on INDIA Alliance PM Candidate: రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే.. ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పీ చిదంబరం తదితరులు ‘న్యాయ్ పత్ర’ పేరుతో శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను ప్రకటించారు. మేనిఫెస్టో రిలీజ్ అనంతరం రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో పాల్గొనగా.. కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న…
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) తరఫున ప్రధాని అభ్యర్థిగా తన సోదరుడు షహబాజ్ షరీఫ్‌ను ఆయన నామినేట్ చేశారు.
బీఎస్పీ ఎంపీ మలక్ నగర్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి నిజంగా బీజేపీని ఓడించాలనుకుంటే.. మాయావతిని భారత కూటమికి ప్రధాని అభ్యర్థిగా చేయాలని.. ఇది జరగకపోతే.. బీజేపీని గద్దె దించడం అసాధ్యం అని ఆయన చెప్పారు. మోడీని అడ్డుకునేందుకు బీఎస్పీతో పొత్తు అవసరం.
Nitish Kumar: బీజేపీని ఓడించేందుకు 2024లో కాంగ్రెస్, జేడీయూ, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ వంటి పార్టీలు కూటమి కట్టాయి. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి ప్రధాని అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. ప్రధాని పదవిపై చాలా మంది నేతల గురి ఉంది. మమతాబెనర్జీ, నితీష్ కుమార్, రాహుల్ గాంధీ ఇలా పలువురు నాయకులు ప్రధాని పదవికి అర్హులని ఆయా పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నితీష్ కుమార్ ప్రధాని అవుతారని ఆయన పార్టీ జేడీయూకు చెందిన…
I.N.D.I.A Alliance PM Candidate: ఈసారి ఎలాగైనా భారతీయ జనతాపార్టీని అధికారంలోకి రానివ్వకూడదని ప్రతిపక్షాలు గట్టిగా నిర్ణయించుకున్నాయి. దాని కోసమే బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చొరవతో ప్రతిపక్ష కూటమి ఇండియాను ఏర్పాటు చేశారు. ఇందులో 26 పార్టీలు ఉన్నాయి. అయితే ఇండియా కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ను ఓడించాలంటే ఐకమత్యం చాలా అవసరం. అయితే ఈ పార్టీ నేతలు చాలా రోజులు ఘర్షణ పడకుండా ఉండగలరో లేదో అర్థం కావడం లేదు.…
Rahul Gandhi: 2024 లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఉండనున్నారు.
Nitish Kumar: తనకు ప్రధాన మంత్రి కావాలనే కోరిక లేదని అన్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. 2024లో ప్రధాని కావాలనే కోరిక లేదని.. తన కోసం నినాదాలు చేయవద్దని తన పార్టీ కార్యకర్తలకు ఉద్దేశించి గురువారం వ్యాఖ్యానించారు. అంతకుముందు బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ కూడా నితీష్ కుమార్ ప్రధాని కావాలనే కోరికను బయటపెట్టారు. ఆయన కోరికను నితీష్ కుమార్ తోసిపుచ్చారు. రోబోయే ఎన్నికల్లో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంపై తాను దృష్టిపెట్టానని నితీష్ కుమార్ అన్నారు.